గాంధీ మెమోరియల్‌ని సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- January 26, 2017
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ డిప్యూటీ సూప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ లైద్, మహాత్మాగాంధీ మెమోరియల్‌ని సందర్శించారు. భారతదేశంలో అధికారిక పర్యటన సందర్భంగా ఢిల్లీలోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ని ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా రాజ్ ఘాట్ మెమోరియల్‌లో ఒక నిమిషం పాటు ఆయన మౌనం పాటించి, మహాత్ముడికి నివాళులర్పించారు. మహనీయులు ప్రజల గుండెల్లో, ఆయా దేశాల చరిత్రల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, గెస్ట్ బుక్‌లో పేర్కొన్నారు. ఫౌండర్ ఫాదర్ షేక్ జాయెద్, 1975లో భారతదేశ పర్యటన సందర్భంగా భారతదేశంతో ఏర్పరచిన సంబంధాల్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నట్లు తెలిపారాయన. 1975లో పాతిన చెట్టుకి నీళ్ళు పోసి, ఇప్పుడు కొత్తగా మరో మొక్కని అక్కడ నాటడం జరిగింది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు నాటిన మొక్కలున్నాయిక్కడ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







