ఘనంగా ఇండియన్ స్కూల్ భారతదేశ 68 వ గణతంత్ర దినోత్సవ వేడుక ...

- January 29, 2017 , by Maagulf
ఘనంగా ఇండియన్ స్కూల్  భారతదేశ 68 వ గణతంత్ర దినోత్సవ వేడుక ...

మస్కట్ : జనవరి 26 వ తేదీన భారతదేశ 68 వ గణతంత్ర దినోత్సవంను మస్కట్ లోని ఇండియన్ స్కూల్ పాఠశాల ఆవరణలో గొప్ప దేశభక్తితోజరుపుకున్నారు. ఇండియన్ స్కూల్ మస్కట్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు ఎన్ ఒమనకుట్టన్,పాఠశాల నిర్వహణ సంఘం సభ్యులు,ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డీప్ విల్సన్, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్ధులని విల్సన్ స్వాగతించి రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను వివరించారు. 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి భారతదేశ రాష్ట్రపతి ప్రసంగ పాఠాలను ఈ అందర్భంగా ఒమనకుట్టన్ చదివి వినిపించారు. గణతంత్ర వేడుకలకు గుర్తుగా విద్యార్థినీ విద్యార్థులు  సందర్భానికి గుర్తుగా జాతీయ పతాకాన్ని స్ఫురణకు తెచ్చేలా  మూడు రంగుల దుస్తులను ధరించి పాఠశాల ఐక్యత, విద్య యొక్క పరమార్ధాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా, రబీంద్ర సంగీత్ గురు దీపక్ రాయ్ దర్శకత్వం ఆధారంగా ఒక ఒడిస్సీ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను, విదార్ధినీ విద్యార్థులను  మంత్రముగ్ధులను చేసింది. 68 వ గణతంత్ర దినోత్సవం పునస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాష్టప్రతి చేత గౌరవించబడిన :   సహాయక వైస్ ప్రిన్సిపాల్ షహీన్ కస్మాని , ప్రీ-ప్రైమరీ విభాగం అపోలోనియ జోసెఫ్, మధ్య విభాగం వైస్ ప్రిన్సిపాల్ మరియు సైన్స్, ప్రాథమిక సెక్షన్ శాఖఆధిపతి జాకబ్ జెకర్యా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్   జాన్స్ అబ్రహం, ఈ ఉపాధ్యాయులు విద్యని బోధించే విధానాన్ని పెంపొందించడానికి వారి ఆజ్ఞాపూరితమైన నిస్వార్ధం అంకితభావం మరియు దేశభక్తి పాఠశాల అభివృద్ధికి ఒక వర్ణనాత్మక పునాదిగా కీర్తిస్తూ వారి సేవలకు గుర్తుగాసత్కరించబడ్డారు.అకాడెమిక్ సబ్-కమిటీ చైర్పర్సన్ గురబింద్ర్ సింగ్ పుణ్ కు ఒమనకుట్టన్ శాలువాని కప్పి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఒక  ప్రశంసాపత్రాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు. సీబీఎస్ఈ నేషనల్ అథ్లెటిక్ మీట్ క్రీడలలో బంగారం, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్న ఇండియన్ స్కూల్ మస్కట్ విద్యార్థులు సైతం ఇండియన్ స్కూల్ మస్కట్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు ఎన్ ఒమనకుట్టన్ చేత సత్కరించబడ్డారు. ఈ కార్యక్రమంకు హాజరైన ప్రతి ఒక్కరికి పాఠశాల నిర్వహణ సంఘం సభ్యులు, ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డీప్ విల్సన్ విల్సన్ కృతజ్ఞతలు తెలియచేసి జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగింపు పలికారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com