తెలుగు వైద్యుడికి పురస్కారం...
- January 29, 2017
వెన్నెముక వ్యాధి పరిశోధనకు గుర్తింపు
హైదరాబాద్: వృద్ధుల్లో వంకర తిరిగిన వెన్నెముకను సరిచేయడం, వంపు వల్ల నరాల మీద కలిగే ఒత్తిడిని తగ్గించడం.. తదితర అంశాల ప్రాతిపదికన తెలుగు యువ వైద్యుడి పరిశోధన పత్రానికి పురస్కారం లభించింది. అత్యంత చిన్నగాటుతో నిర్వహించే ఈ శస్త్రచికిత్స ద్వారా వెన్ను బాధల నుంచి విముక్తి కావచ్చని పరిశోధన పత్రంలో వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నరేశ్‌బాబు నేతృత్వంలో డాక్టర్ అరుణ్‌కుమార్ అధ్యయనం చేశారు. డాక్టర్ రాజు కూడా ఈ బృందంలో సభ్యులు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నాలుగు రోజులుగా జరుగుతున్న వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుల జాతీయ సదస్సు ముగింపు రోజైన ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ రామ్‌చద్దా చేతుల మీదుగా యువ పరిశోధకుడి విభాగంలో అరుణ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం మూడు పురస్కారాలివ్వగా మిగిలిన రెండింటిని దిల్లీ వైద్యులు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







