కెనడా మసీదులో కాల్పులు.... ఐదుగురు దుర్మరణం...
- January 29, 2017
మాంట్రియల్: కెనడాలోని ఓ మసీదులోకి ముగ్గురు దుండగులు భారీ ఆయుధాలతో ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. క్యూబెక్ సిటీలో ఆదివారం సాయంత్రం మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దాడికి పాల్పడినట్టు భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరుగిన సమయంలో క్యూబెక్ సిటీ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో మొత్తం 40 మంది ఉన్నట్టు సమాచారం. కాగా ఇదే మసీదు వద్ద గతేడాది జూన్‌లో కొందరు దుండగులు పంది తలను ఓ కవర్‌లో ప్యాక్ చేసిపెట్టడంతో కలకలం రేగింది.
ముస్లిం మహిళలు సంప్రదాయంగా ధరించే నిఖాబ్‌పై నిషేధం విధించాలంటూ గత కొన్నేళ్లుగా రాజకీయ చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ తరచూ ముస్లిం వ్యతిరేక సంఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









