మీ మట్టి చేతులు ... శుభ్రమైన యూ.ఏ.ఈ.కి దారులు

- September 15, 2015 , by Maagulf
మీ మట్టి చేతులు ... శుభ్రమైన యూ.ఏ.ఈ.కి దారులు

మొత్తం ఏడు ఎమిరేట్ దేశాలలో జరగనున్న 14 వ "క్లీన్ అప్ యూ.ఏ.ఈ."  కాంపైన్, డిసెంబర్ 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు జరుగుతుందని,  నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ (EEG)  ఛైర్ పర్సన్ హబీబా అల్ మరాషీ - ఈ కాంపైన్ దుబాయిలో మొదలై, దిబ్బా-అల్-హిస్న్ లో ముగుస్తుందని ; 2002 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం యూ. ఏ.  ఈ  పర్యంతం వ్యాప్తించి, దేశాన్ని పర్యావరణ హితంగా చేసే లక్ష్యంతో ప్రజలనందరినీ ఏకంచేసే కార్యక్రమంగా మారిందని వివరించారు. ఈ సంవత్సరం లక్ష్యం - ప్రపంచాన్ని మరింత మెరుగైన నివాస ప్రదేశం గా మార్చడానికి  కలసి పనిచేయడం అని,  ముఖ్యంగా  ప్రతి వ్యక్తికి  ఆచరణలోకి దిగవలసిన బాధ్యత ఉందని ఆమె తెలిపారు. గత సంవత్సరం ఈ కార్యక్రమంలో 123, 176 మంది అవిశ్రాంతంగా పాల్గొని, 94 టన్నుల పొగుపడిన చెత్తను శుభ్రం చేశారని, ఈ సంవత్సరం మరింత మంది పాల్గొంటారని ఆశిస్తున్నామన్నారు. సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి యూ. ఏ.  ఈ. నివాసులకు ఉపయోగపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెబుతూ కార్యక్రమ కాలెండరును ఈ విధంగా ప్రకటించారు:

డిసెంబరు 5 - దుబాయి

డిసెంబరు 6- రాస్-అల్-ఖైమా

డిసెంబరు 7 - షార్జా

డిసెంబరు 8 - ఆజ్మాన్

డిసెంబరు 9 - అబూ ధబి

డిసెంబరు 10 - అల్ ఐన్

డిసెంబరు 12 - ఉమ్మ్-అల్- క్వ్‌వైన్  

డిసెంబరు 13 - ఫ్యూజైరా

డిసెంబరు 15 - ఫ్యూజైరా  లో మొక్కలు నాటే కార్యక్రమం

డిసెంబరు 16- దిబ్బా-అల్-హిస్న్

 

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com