అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి...
- January 30, 2017
ఏడు ఇస్లామిక్ దేశాలపై నిషేధం నిషేధంతో ప్రపంచదేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికాకు రెండు సంపన్న ముస్లిం దేశాల సమర్థనతో తొలిసారి ఊరట లభించింది. అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సిరియా, యెమెన్ లాంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే శరణార్థులను అక్కున చేర్చుకునేబదులు.. ఆయా దేశాల్లోనే సేఫ్ జోన్లు(రక్షణ ప్రాంత్రాలు) నిర్మించాలన్న అమెరికా ప్రతిపాదనను సౌదీ అరేబియా, అబుదాబిలు సమర్థించాయి. (ట్రంప్ 'నిషేధం': ఐసిస్ విజయోత్సవాలు)
ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్‌తోనూ, అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ సహ్యాన్‌తోనూ ఫోన్‌లో జరిపిన సంభాషణలో సానుకూలత వ్యక్తమైందని వైట్‌హౌస్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.
సిరియా, యెమెన్ సహా అంతర్యుద్ధం కొనసాగుతున్న దేశాల్లో సేఫ్ జోన్లు నిర్మించడం ద్వారా పాశ్చాత్య దేశాలకు శరణార్థుల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చన్న ట్రంప్ ఆలోచనకు ఇద్దరు రాజులూ మద్దతు పలికారని, దీనితోపాటు సౌదీ-అమెరికా, అబుదాబి-అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలపైనా వారు చర్చించారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







