'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం సాధించిన సందర్భంగా పార్టీ..

- January 31, 2017 , by Maagulf
'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం సాధించిన సందర్భంగా పార్టీ..

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం సాధించిన సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి నగరంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 
అయితే వారందరిలో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం బాలయ్య కుటంబమే. బాలకృష్ణ తన భార్య వసుంధర, కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్వినిలతో కలసి ఈ పార్టీకీ హాజరయ్యాడు. అలాగే క్రిష్‌, ఆయన భార్య రమ్య కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ఇక, బాలయ్య కుటంబ సభ్యులంతా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ సినిమా చూసి గర్వపడుతున్నామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com