భారతీయుడి అరెస్ట్‌పై సుష్మ ఆరా..

- January 31, 2017 , by Maagulf
భారతీయుడి అరెస్ట్‌పై సుష్మ ఆరా..

అమెరికాలోని నార్త్‌ డకోటా విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కేసులో భారతీయ వ్యక్తిని అరెస్ట్‌ చేయడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆరా తీస్తున్నారు. అమెరికాలో భారత రాయబారిని ఈ ఘటనపై నివేదిక కోరినట్లు ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గుజరాత్‌కు చెందిన పరమన్‌ రాధాకృష్ణన్‌(53) అనే వ్యాపారిని శనివారం నార్త్‌ డకోటాలోని గ్రాండ్‌ ఫోర్క్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

తన బ్యాగులో పేలుడు పదార్థాలున్నాయని ట్రావెల్‌ ఏజెంట్‌తో చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు రాధాకృష్ణన్‌ను అరెస్ట్‌ చేశారు.
తన భర్తకు సహాయం చేయాలని కోరుతూ రాధాకృష్ణన్‌ భార్య ట్విట్టర్‌ ద్వారా సుష్మను అభ్యర్థించారు. ఆమెకు ట్వీట్‌కు స్పందించిన సుష్మ ఈ ఘటనపై భారత రాయబారిని వివరాలు అడిగామని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ సహా పలువురు రాధాకృష్ణన్‌ స్నేహితులు ఈ విషయంలో సుష్మ సాయం కోరారు.

తప్పుడు కేసులో అతడిని ఇరికించారని ఆరోపించారు. వారం పాటు వ్యాపార పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన రాధాకృష్ణన్‌ తిరిగి భారత్‌కు వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com