'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' నటుడు డ్రగ్స్‌ కేసులో అరెస్టు..

- January 31, 2017 , by Maagulf
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' నటుడు డ్రగ్స్‌ కేసులో అరెస్టు..

సిద్దార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం లో ప్రతినాయకుడి పాత్రలో నటించిన అభిషేక్ కుమార్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఈ నటుడు జైలు ఊసలు లెక్కపెడుతున్నాడు..డ్రగ్స్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..
అరకొర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అభిషేక్ , ఆ తర్వాత ఛాన్స్ లేవి రాకపోయేసరికి అడ్డదారిన డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు..అభిషేక్‌, మరో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి కొకైన్‌ విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఏకంగా 5వేల మంది వరకు కస్టమర్లను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఈ గుట్టును రట్టు చేసి అభిషేక్‌ సహా ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు.
 

వారి వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్‌, 12 సెల్‌ఫోన్లు, ఓ కారు, బైకు, రూ 46 వేల నగదును స్వాధీనం చేసుకొని , వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని డీసీపీ లింబారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జాతీయుడు మండేలా జేమ్స్‌, ఘనా దేశీయుడు డ్రేక్‌ ఓవెన్‌ ఇద్దరూ బంధువులు. వసా్త్రల వ్యాపారం పేరుతో బిజినెస్‌ వీసాపై ముంబై వచ్చారు. ఆ వ్యాపారం మాటున దక్షిణాఫ్రికా నుంచి కొకైన్‌ను ముంబైకి సరఫరా చేసేవారు. అక్కడి నుండి హైదరాబాద్ లోని సినీ నటుడు అభిషేక్‌ కుమార్‌, శ్రీనివాసులు అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. వీరికి గ్రాము కొకైన్‌ను రూ.3,500కు విక్రయించేవారు. అభిషేక్‌ కుమార్‌, శ్రీనివాసులు దాన్ని రూ.4 నుంచి రూ.5 వేలకు అమ్మేవారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com