మరో శివ అఖిల్ సినిమా..

- January 31, 2017 , by Maagulf
మరో శివ అఖిల్ సినిమా..

విక్రమ్ కె.కుమార్‌. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఇష్క్‌, మనం, 24 లాంటి వైవిధ్యమైన చిత్రాలు తీశాడు. ఇప్పుడు అఖిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అఖిల్ సినిమా తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే ఈ సినిమా పల్టీ కొట్టేసింది. దీంతో రెండో సినిమా పై చాలా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడా భాద్యత విక్రం పై వుంచాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగ, ఈ సినిమా పై కధపై తాజగా పెదవి విప్పారు నాగార్జున. "ఆ రోజుల్లో నాకు శివ సినిమా ఎలా మైలురాయిగా నిలిచిందో తెలుగు సినిమాకి ఓ కొత్త ట్రెండ్ పరిచయం చేసిందో అఖిల్ సినిమా కూడా అలానే ఉండబోతోంది. విక్రమ్ నాకు అంత మంచి కథ చెప్పాడు.
నిజంగా ఈ సినిమా చూసిన చాలా థ్రిల్ ఫీల్ అవుతారో. ఈ కధను స్క్రీన్ పై చూడాలని చాలా ఆత్రుతగా వుంది" అని చెప్పుకొచ్చాడు నాగ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com