ఒమన్ లో మిత్రుడిని చంపి...

- January 31, 2017 , by Maagulf
ఒమన్ లో మిత్రుడిని చంపి...

మస్కట్ : మానవ సంబంధాలన్నీ..ఆర్ధిక సంబంధాలే అని ఏనాడో తేల్చి చెప్పిన ఆర్ధిక తత్వవేత్త మాటలు అక్షర సత్యాలు..స్నేహం అందుకు మినహాయింపు ఏమీ కాదు. కేరళ రాష్ట్రం కొచ్చిన్ నుంచి సందర్శన వీసాతో ఒమాన్ కు వచ్చి అనుమానాస్పదంగా మరణించిన ఇరువురు భారతీయ మిత్రుల హత్య మిస్టరీ వారం రోజులలోనే వీడింది. శలాలః నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మెరైట్ లో ఇప్పటికే పలు క్రషింగ్ కంపెనీ లు ఉన్న చోటునే మరో నూతన క్రషర్ కంపెనీ ను మొదలుపెట్టాలని భావించి  శలాలః ప్రాంతంలోని దక్షిణ ఒమన్ లో గత నెల 23 వ తేదీన ధారీజ్  ప్రాంతంకు వచ్చిన వీరి మధ్య ఏర్పడిన ఆర్థిక వివాదం కారణంగా తన స్నేహితుదీని కత్తితో పొడిచి  చంపి ఆ తరువాత ఆత్మహత్య చేసుకొన్నట్లు రాయల్ ఒమాన్ పోలీసులు పోలీసులు నిరార్ధించారు. ఒక ఆర్థిక వివాదం కారణంగా తన మిత్రుడ్ని కత్తితో పొడిచి చంపిన తర్వాత సమీప భవనం లోనికి వెళ్లి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఒక పోలీస్ అధికారి తెలిపి మిగిలిన వివరాలు ఇవ్వకుండా దాటవేశారు. ఈ ఇరువురు దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుండి ఇక్కడకు వచ్చిన 40 ఏళ్ళు 50 ఏళ్ళ మధ్య వయస్కులైన మొహమ్మద్ ముస్తఫా మరియు నజీబ్ మహమ్మద్లుగా అధికారులు గుర్తించారు. గత ఏడాది నవంబర్ లో మరొక సందర్భంలో ఒక హత్య జరిగింది.  పింకీ పామిత్తాన్ 31 ఏళ్ల  ఫిలిప్పియన్ సేవకురాలు, ఆమె సహోద్యోగి అయిన ఒక భారతీయుడు ఒకరు తనతో లైంగిక సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దానికి నిరాకరించిన ఆమెని తీవ్రంగా కొట్టి గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. వాడి లోని సుల్తాన్ కబూస్ గ్రాండ్ మసీదు వెనుక ఆమె శరీరంని పారవేసి పరారై పోయాడు. అదేవిధంగా జూలై, 2016 లో ఒక 50 ఏళ్ల భారతీయ కార్మికుడు మస్కట్ గవర్నరేట్ మూత్రహ్ ప్రాంతంలో తన అపార్ట్మెంట్ లో గొంతు కోయబడి రక్తం మడుగులో పడి దారుణంగా హత్య చేయబడ్డాడు. దోపిడీ ,హత్య వెనుక గల కారణాలని  కనుగొని అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా గత ఏడాది ఏప్రిల్ 21 న శలాలః ప్రావిన్స్ లో ఆమె నివాసంలో హత్యకు గురైన దక్షిణ భారతదేశం కేరళ రాష్ట్రంకు చెందిన 25 ఏళ్ల నర్సు చిక్కు రాబర్ట్ మర్డర్ మిస్టరీ ఇంకా  పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒమన్ లో హత్యలు అత్యంత అరుదు. కాగా 2015 కేవలం ఆరు హత్యలు మాత్రమే నమోదయ్యాయి.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com