మరింత సులభంకానున్న పాస్పోర్టు సేవలు
- February 01, 2017
పాస్పోర్టు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. పాస్పోర్టు పొందాలంటే ఇప్పటి వరకు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇకపై ప్రధాన తపాలా కార్యాలయాల్లో కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
* జవాన్లు, సైనికాధికారులు ఆన్లైన్ ద్వారా రైలు టికెట్లు కొనుక్కునేందుకు వీలుగా ''కేంద్రీకృత రక్షణ ప్రయాణ వ్యవస్థ'ను అభివృద్ధి చెసినట్లు విత్తమంత్రి తెలిపారు. టికెట్ల కోసం సైనికాధికారులు రైల్వే వారెంట్ పట్టుకుని క్యూలో నిల్చుని ఇబ్బండి పడాల్సిన అవసరం ఇంక ఉండదన్నారు.
* రక్షణరంగ పింఛనర్ల కోసం ఇంటర్నెట్ ఆధారిత సమగ్ర పింఛను పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యవస్థ పింఛను ప్రతిపాదనలు అందుకుని చెల్లింపులు జరుపుతుందన్నారు. ఫలితంగా .. రక్షణ రంగ పింఛనుదార్ల ఇబ్బందులు తీరుతాయని జైట్లీ వెల్లడించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







