దారితప్పిన విమానం, తృటిలో తప్పిన పెను ప్రమాదం
- February 01, 2017
దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం వెళ్లవలసిన ఇండిగో విమానం ఒకటి విమానాశ్రయంలో దారి తప్పింది. అప్పటికే ఆ మార్గంలో జెట్ ఎయిర్వేస్ విమానం నిలిచి ఉంది. సకాలంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్రమత్తం చేయడంతో ముప్పును నివారించగలిగారు. ఇండిగో విమానం 6ఇ 719కు 28వ రన్ వే కేటాయించారు. 'సి' లేన్ ద్వారా ఆ విమానం రన్‌వేపైకి రావాలి. రన్‌వేను దాటి డబ్ల్యూ లేన్‌లోకి వెళ్లిపోయినట్లు కమాండర్ గుర్తించారు. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా అప్రమత్తం చేయడంతో కమాండర్ విమానాన్ని తక్షణం నిలిపివేశాడు. మంచు కారణంగా సరిగా కనిపించకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని ఇండిగో చెబుతుండగా, రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటనతో పలు విమానాలు గంట పాటు ఆలస్యమయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







