గ్రీన్‌కార్డు ఉన్నవారికి మినహాయింపు...

- February 02, 2017 , by Maagulf
గ్రీన్‌కార్డు ఉన్నవారికి మినహాయింపు...

వాషింగ్టన్‌: వలసలు, శరణార్థులను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన నిషేధం నుంచి అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్నవారిని మినహాయించారు. ముస్లిం మెజారిటీ ఉన్న ఏడు దేశాల నుంచి మూణ్నెల్ల పాటు అమెరికాకు ఎవ్వరూ రాకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో గ్రీన్‌ కార్డు ఉన్న ఆ ఏడు దేశాలకు చెందిన వారు అమెరికా నుంచి బయటకు వెళ్లడానికి, తిరిగి అమెరికాకు రావడానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని.. వారికి మినహాయింపు ఇస్తున్నామని శ్వేతసౌధం అధికార ప్రతినిధి సీన్‌ స్పైసర్‌ తాజాగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్‌ విధించిన నిషేధం అంతర్జాతీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ నిషేధంతో ఏడు దేశాలకు చెందిన వారికి గ్రీన్‌ కార్డు ఉన్నప్పటికీ అమెరికాకు వెళ్లే విమానాల్లో , అమెరికా నుంచి వచ్చే విమానాల్లో ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వైట్‌హౌస్‌ విడుదల చేసిన తాజా ప్రకటన ద్వారా గ్రీన్‌కార్డుదారులకు వూరట లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com