అల్ ముష్రిఫ్‌లో సామూహిక వివాహాలు
- February 02, 2017
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో సామూహిక వివాహాలు జరిగాయి. అల్ మష్రిఫ్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో వధూవరులు పాల్గొన్నారు. 31 జంటలు ఈ సందర్భంగా వివాహం చేసుకున్నాయి. ముష్రిఫ్ మజ్లిస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అబుదాబీలోని ముష్రిఫ్ ప్రాంతం ఈ వేడుకకి వేదికయ్యింది. షేక్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ సురూర్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్, షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమా పలువురు ప్రముఖులు ఈ వేడుకకి హాజరయి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్థానికులు కూడా పెద్దయెత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారులు సైతం పెద్ద సంఖ్యలో హాజరై ఈ అద్భుతమైన వేడుకని తిలకించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









