భారీ హిస్టారికల్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా...

- February 02, 2017 , by Maagulf
భారీ హిస్టారికల్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా...

ప్రముఖ హీరోతో 'హిరణ్యకశ్యప' నిర్మిస్తా: దర్శకుడు గుణశేఖర్‌
సింహాచలం: తల్లి గర్భంలో నుంచే విష్ణుభక్తిని జీర్ణించుకుని భక్తాగ్రగణ్యుడుగా ఖ్యాతిగాంచిన భక్త ప్రహ్లాదుడి జీవిత చరిత్ర ఆధారంగా 'హిరణ్యకశ్యప' అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెలిపారు. గురువారం ఆయన కాస్ట్యూమ్‌ డిజైనర్‌, తన భార్య శారదతో కలిసి వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతినాయక ప్రధాన కథలతో వస్తున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయన్నారు. ఇందుకు అనుగుణంగా పెద్ద హీరోలు విల నిజం పాత్రల వైపు మొగ్గుచూ పుతున్నారన్నారు.
'రుద్రమదేవి'కి సీక్వెల్‌గా 'ప్రతాప రుద్ర' చిత్రాన్ని నిర్మిస్తామని, రెండు చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. స్ర్కిప్టులు సిద్ధమయ్యాయని, ముందుగా 'హిరణ్యకశ్యప' సెట్స్‌పైకి వెళ్తుందన్నారు. కథ నచ్చితే ఇందులో హీరోగా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటిస్తారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com