'నీలంపాటి అమ్మోరు' గీతావిష్కరణ...
- February 05, 2017
సుమన్ ప్రధాన పాత్రలో శ్యామ్, శ్రీకీర్తిక జంటగా తెరకెక్కిన చిత్రం 'నీలంపాటి అమ్మోరు'. తోటకృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కొమర వెంకటేశ సారథ్యం వహిస్తున్నారు. ఎం.ఎ్‌స.చౌదరి సమర్పిస్తున్నారు. గణేశ ట్రావెల్స్ హనుమంతరావు సహకారంతో నవ్య మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది. శాసనసభ్యుడు రసమయి బాలకిషన ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీలను సుమన అందుకున్నారు. ఇందులో అమ్మవారి భక్తుడిగా చాలెంజింగ్ పాత్రలో నటించడం ఆనందంగా ఉందని సుమన తెలిపారు. తోటకృష్ణ మాట్లాడుతూ ''700 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలోని నీలంపాటి అమ్మవారి జీవిత కథ, మహిమలతో ఈ సినిమాను రూపొందించాం.
నటీనటుల పెర్ఫార్మెన్స, గ్రాఫిక్స్, సంగీతం వంటివి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అని చెప్పారు. సంగీత దర్శకుడు ఘనశ్యామ్ మాట్లాడుతూ ''ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. తప్పకుండా అందరికీ నచ్చుతాయనే నమ్మకం ఉంది'' అని తెలిపారు. సినిమా పెద్ద హిట్ కావాలని రసమయి బాలకిషన, ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, శ్యామ్, శ్రీకీర్తిక ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









