రెండు తెలుగు గొంతుకలు సీజన్-9 ఇండియన్ ఐడాల్ లో..
- February 05, 2017
ఇండియన్ ఐడాల్... సోనీ టీవీ వేదికగా జరిగే స్వరరాగ సంగ్రామం. దేశంలోని గాయకులకు కలల వేదిక. తమ ప్రతిభను జాతీయ వేదికలపై చాటుకునే అరుదైన అవకాశం. అలాంటి ఛాలెంజింగ్ డయాస్ పై రెండు తెలుగు గొంతుకలు సీజన్-9 టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. మాస్ సాంగ్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్రను వేసుకున్న రేవంత్, మెలొడీస్ తో మెస్మరైజ్ చేసే రోహిత్... ఇప్పుడు నేషనల్ లెవల్లో తమ సత్తా చాటుతూ టైటిల్ రేసులో టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడా పోరాటానికి మన సపోర్ట్ కూడా చాలా అంటే చాలా అవసరం.
చూడటానికి హీరోలా కనిపించే రోహిత్, లుక్స్ లోనే కాదు, పాటలు పాడ్డంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. వీరెంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్లను ఇంప్రెస్ చేసి టాప్-8లో మోస్ట్ మెస్మరైజింగ్ సింగర్ అనిపించుకున్నాడు. ఇప్పటికే తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన సూపర్ సింగర్స్ లో తన టాలెంట్ తో ఆ సిరీస్ లోనే ప్రత్యేకంగా నిలిచాడు. ఆటపాటలతో స్టేజ్ ని హుషారెత్తించే వాడు. కీరవాణి లాంటి సంగీతదర్శకులను ఆకట్టుకుని బిగ్గెస్ట్ విజువల్ వండర్ బాహుబలిలో మనోహరి అంటూ హుషారెత్తించాడు. ఇప్పుడు బాలీవుడ్ ను రాక్ చెయ్యడానికి ఇండియన్ ఐడిల్ సీజన్-9 బరిలో దిగాడు. రేవంత్ కు పెద్దగా హిందీ తెలియదు.. కానీ పాట సోల్ ని మిస్ చేయడు. అదే రేవంత్ ని ఇప్పడు టాప్ ప్లేస్ లో నిలిపింది.
సోను నిగమ్, ఫరాఖాన్, అను మాలిక్ వంటి బాలీవుడ్ పాపులర్ పర్సన్స్ ని తన టాలెంట్ తో సీట్లనుండి కదిలించాడు. బాలీవుడ్ లో కూడా ప్లే బ్యాక్ సింగర్ గా, అక్కడి ప్రేక్షకులను తన పాటతో కట్టిపడెయ్యాలనే తన కలకు ఇండియన్ ఐడిల్ ఒక రూపం ఇస్తుందని నమ్ముతున్నాడు రేవంత్. టాలీవుడ్ లో మాస్ మసాలా పాటల నుండి మెలోడీ సాంగ్స్ వరకూ పాడి సక్సెస్ పుల్ సింగర్ గా ప్రయాణిస్తోన్న రేవంత్ కు ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్ మరో మలుపు కాబోతుంది. తన కలను సాకారం చెయ్యబోతోంది.
సినిమాలకు ఇప్పుడిప్పుడే పాటల ప్రయాణం మొదలు పెట్టిన రోహిత్ స్వరం తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పాడుతా తీయగా, సూపర్ సింగర్స్ వంటి కాంపిటేషన్స్ లో రోహిత్ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. మెలోడీస్ లో మంచి పట్టు కనపరిచే ఈ కుర్రాడు బాలు మెచ్చిన గాయకుడు. భక్తి పాటలలో తనదైన ముద్రను వేయగలిగిన ఈ యువతరంగ్ ఇండియన్ ఐడిల్ 9సీజన్ లో తన స్వరంతో మెస్మరైజ్ చేస్తున్నాడు.
రేవంత్ సెలెక్ట్ చేసుకునే సాంగ్స్ లో చాలావరకూ మెలోడీస్ అండ్ ఫీల్ తో నిండినవే. బాష బాగా తెలిస్తే తప్ప ఆ భావం పలకదు అనే మాటలు చాలా వింటాం.. భావం అర్దం కావడానికి భాష అడ్డుగోడ కాదని తన పాటలకు కొడుతున్న చప్పట్లు సాక్షిగా నిరూపించాడు రేవంత్. ఇక టాప్-10 టఫ్ కాంపిటీషన్ లో, మెస్మరైజింగ్ వాయిస్ తో ఫైనల్-8లో చోటు సంపాదించుకున్నాడు రోహిత్. తెలుగు గొంతుకను జాతీయస్థాయిలో వినిపిస్తూ, తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరు టైటిల్ పోరులో నిలవడానికి టాలెంట్ తో పాటు మన సపోర్ట్ కూడా కావాలి. మార్కులతో పాటు ప్రేక్షకుల ఓటింగ్ ను లెక్కలోకి తీసుకుని విన్నర్ ను ఎంపికచేసే ఈ కాంటెస్ట్ లో రోహిత్ , రేవంత్ లకు సపోర్ట్ గా నిలుద్దాం. శ్రీరామ చంద్ర తోనే ఆగిపోలేదు, అలాంటి ఆణిముత్యాలు మన దగ్గర చాలామంది ఉన్నాయనిని ఓటుతో చెబుదాం. తెలుగు గాయకులకి ప్రోత్సాహం అందిద్దాం. ఈ ఆదివారం రాత్రి 8గంటలనుండి సోమవారం ఉదయం 8 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది.. www. sonyliv.com కి లాగిన్ అయి మన సింగర్స్ కి ఓటు వేద్దాం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









