రవితేజ, అనిల్ రావిపూడి, దిల్ రాజు చిత్రం `రాజా ది గ్రేట్` ప్రారంభం...
- February 06, 2017
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో పటాస్, సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం రాజా ది గ్రేట్. వెల్కమ్ టు మై వరల్డ్ క్యాప్షన్.
ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా లాంచనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రవితేజ, మెహరీన్‌లపై ముహుర్తపు సన్నివేశానికి హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ క్లాప్ కొట్టగా, ప్రముఖ ఫైనాన్సియర్ ఎం.వి.ఆర్.ఎస్.ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``రవితేజతో భద్ర సినిమా తర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాలను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది`` అన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``రవితేజగారితో చేస్తున్న డిపరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటి వరకు రవితేజగారు చేయని విలక్షణమైన పాత్రలో కనపడతారు అని దిల్ రాజు వెల్లడించారు.
అలాగే దిల్‌రాజుగారి బ్యానర్లో రెండో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రవితేజగారి అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందిస్తాం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తామని దర్శకుడు తెలిపారు.
రవితేజ, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణః దిల్ రాజు, నిర్మాతః శిరీష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః అనిల్ రావిపూడి.
గత సంవత్సరం అసలు సినిమాలేవీ చేయకుండా గ్యాప్ తీసుకున్న రవితేజ ఇపుడు వరుస సినిమాలకు కమిట్ అవుతుండటం విశేషం. ఏది ఏమైనా రవితేజ వరుస సినిమాలకు కమిట్ అవ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ నిర్మిస్తున్న 'టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







