దురదృష్టం వెంటాడటంతో దొంగ అరెస్ట్
- February 06, 2017
మనామా: దొంగతనంలోనూ అదృష్టం బహుశా ఉండాలేమో ? లేదంటే ఈ దురదృష్టపు చోరుని మాదిరిగా పోలీసులకు సులువుగా చిక్కిపోతారేమో ?? స్థానిక హమద్ టౌన్ లో ఎలాగోలా కస్టపడి కారు అపహరించాడు ఓ దొంగ...ఎవరూ చూడకుండా రయ్ మంటూదూసుకుపోయాడు చాలా దూరం ప్రయాణించి ఓ మారుమూల ప్రాంతానికి చేరుకొని ఇంకెవరూ మనల్ని పట్టుకోలేరనే భావించి తస్కరించిన కారుని ఓ చోట పార్కింగ్ చేసి కారుని ఎలా అమ్మాలి ...ఎంతకు అమ్మాలి అని మల్లగుల్లాలు పడుతూ ఆలోచిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పోలీసులు అక్కడకి వచ్చి ఆ దొంగను అరెస్ట్ చేశారు..తనను ఎలా కనుగొన్నారని ధైర్యం చేసి పోలీసులను అడిగేడా దొంగ..వారు చెప్పిన సమాధానం విని విస్తుపోయాడు..ఎందుకంటే, తానూ తెలియకుండా దొంగిలించిన కారు యజమాని ఇంటికి అతి సమీపంలో పార్కింగ్ చేశాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలిన చందాన సంతోషంతో ఆ కారు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో దురదృష్టపు కారు దొంగని పోలీసులు సులువుగా అరెస్ట్ చేశారు.కోర్టుకి తెలిపిన సమాచారం ప్రకారం, కారుని అపహరించిన దొంగ కారు నెంబర్ ప్లేట్లు మార్చినప్పటకీ యజమాని తన కారుని గుర్తించినట్లు పేర్కొన్నారు.కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 4 వ తేదీన 2014 లో బాధితుడు తన కారుని మనామా రోడ్లపై పార్కు చేసి ఒక నగల దుకాణం లోనికి ప్రవేశించడంతో దొంగ తన హస్త లాఘవం ప్రదర్శించాడు.డబ్బు, వ్యక్తిగత వస్తువులు కలిగి ఉన్న తన కారుతో సహా దొంగ అక్కడ్నించి పారిపోయాడని బాధితుడు లబోదిబోమంటూ అదే రోజున సంఘటన గురించి పోలీసులకు పిర్యాదు చేశాడు. కానీ పోలీసులు షాప్ వెలుపల ఏర్పాటు చేసిన నిఘా( సిసిటివి ) కెమెరాల ఫుటేజ్ సమీక్ష చేసినపుడు , రికార్డింగ్ లో దొంగ స్పష్టంగా కనబడకపోవడంతో పోలీసులు ఏమాత్రం గుర్తించలేకపోయారు. కానీ ఆ దురదృష్టపు దొంగ కారు నెంబర్ ప్లేట్ ని సైతం మార్చినప్పటకీ, తిరిగి తిరిగి విశ్వాసం గల ఆ కారు యజమాని ఇంటి ముందుకు వచ్చి నిలిచింది. ఇదేమీ తెలియని ఆ దొంగ అక్కడే పార్కింగ్ చేసి ఎంచక్కా దొరికిపోయాడు. దీంతో మూడో దిగువ క్రిమినల్ కోర్ట్ ఆ దొంగకు ఒక ఏడాది జైలుశిక్ష,200 బి డి జరిమానాని విధించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







