తొలిసారి మహిళాదినోత్సవం జరుపుకుంటున్న సౌదీ మహిళలు
- February 06, 2017
ఇస్లాం దేశమైన సౌదీ అరేబియాలో తొలిసారి మహిళా దినోత్సవం జరుపుతున్నారు. రియాద్‌లోని కింగ్ ఫహద్ కల్చర్ సెంటర్లో ఈ వారాంతంలో మూడు రోజుల పాటు మహిళాదినోత్సవ ప్రత్యేక సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రిన్సెస్ అల్-జవహరా బింట్ ఫహద్ అల్-సౌద్‌తో పాటు రాజకుటుంబానికి చెందిన పలువురు స్త్రీలు హాజరుకానున్నారు. విద్యారంగంలో మహిళల పాత్ర గురించి, సౌదీలో స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి ముగింపు పలకడం గురించి, మహిళల హక్కుల గురించి ఇక్కడ చర్చించనున్నారు.విద్య, సాంస్కృతిక, వైద్య, సాహిత్య తదితర ఎన్నో రంగాల్లో సౌదీ మహిళల విజయాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటున్నట్లు అధికార ప్రతినిధి మహమ్మద్ అల్-సైఫ్ వెల్లడించారు.
మహిళల హక్కులు కాలరాస్తున్నారని సౌదీపై ఎంతోకాలంగా ఆరోపణ ఉంది. 2015లో ప్రపంచ ఎకనమిక్ ఫోరం లింగ వివక్షపై ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 145దేశాల్లో సౌదీ 134వ స్థానంలో ఉంది.
మహిళలు డ్రైవింగ్ చేయకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ పొందకూడదని నిషేధం విధించిన తొలి దేశం సౌదీ అరేబియా. అలాగే ఇక్కడ మహిళలందరూ తండ్రి లేదా భర్త లేదా సోదరుల అనుమతితోనే చదువు, విదేశీ ప్రయాణాలు, వివాహం చేసుకోవడం చెయ్యాలి. సౌదీ అరేబియాలో మహిళల జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు పురుషుల చెప్పుచేతల్లో నడుస్తోందని మానవహక్కుల పరిరక్షణ సంఘం పేర్కొంటోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







