ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం
- February 06, 2017
పాపం.. ఇంగ్లాండ్! క్రికెట్‌లో ప్రతి ఫార్మాట్‌లో భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదు. మొన్న కోహ్లీసేన చేతిలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయింది. స్వదేశంలో జరుగుతున్న అంధుల క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన టీ20లోనూ చిత్తు చిత్తుగా ఓడింది. ఇప్పుడు యూత్‌వన్డే అండర్-19 ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ కోల్పోయింది. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా కుర్రాళ్లు ఇంగ్లాండ్‌ను 230 పరుగుల భారీ తేడాతో ఓడించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..
శుభమ్ గిల్ (160 నాటౌట్; 120 బంతుల్లో), పృథ్వీషా (105; 89 బంతుల్లో) అద్భుత శతకాలు సాధించడంతో 9 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 164 బంతుల్లో 231 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను బౌలర్లు చుట్టేశారు. కమలేశ్ నాగర్‌కోటీ (4/31), వివేకానంద తివారీ (3/20), శివమ్ మావీ (2/18), ముగ్గురూ కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లిష్ జట్టు 152 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకొంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







