ట్రంప్ నిర్ణయంపై న్యాయ పోరాటానికి సిద్దమైన టెక్ దిగ్గజాలు
- February 06, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించడాన్ని ప్రముఖ కంపెనీలన్నీ తప్పుపడుతున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ సహా 100కు పైగా కంపెనీలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు కోర్టుల్లో కేసులు దాఖలు చేశాయి. ట్విట్టర్ అయితే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తున్న అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ సంస్థకు అండగా నిలిచేందుకు 1.59 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది.
అమెరికా ఆర్థికవ్యవస్థలో ఇతర దేశాల నుంచి వచ్చిన పాత్ర కీలకమని ప్రముఖ కంపెనీలన్నీ నొక్కి చెప్పాయి. దేశంలో అనేక గొప్ప ఆవిష్కరణలకు వలస వచ్చినవారే కారణమని.. అమెరికాలో ఫార్చ్యూన్-500 కంపెనీల్లో 200కు పైగా వలస వచ్చినవారు లేదా.. వారి పిల్లలు సృష్టించినవేనని గుర్తు చేశాయి. తమ కంపెనీలను, వ్యాపారాలను ట్రంప్ ఉత్తర్వులు తీవ్రంగా దెబ్బతీస్తాయని అమెజాన్, ఎక్స్పీడియా కంపెనీలు వాషింగ్టన్ అటార్నీ జనరల్ ముందు తమ వాదనల్లో వినిపించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, ఉబర్ లకు మద్దతుగా నెట్ఫ్లిక్స్, ఫేస్ బుక్, ఇంటెల్, లెవీ స్టాప్ కంపెనీలు కూడా మద్దతు పలికాయి.
మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. తన ఆర్డర్స్ ను అడ్డుకున్న శాన్ ప్రాన్సిస్కో జిల్లా జడ్జి జేమ్స్ రాబర్ట్పై ట్వీటర్లో మండిపడ్డారు. దేశంలో ఏదైనా జరిగితే అమెరికన్లు ఆ జడ్జినే తప్పుపట్టాలని ట్రంప్ ట్వీట్ చేశారు. మన దేశాన్ని ఇలాంటి ఆపదలోకి ఒక జడ్జి నెడతారనే విషయం నమ్మలేకుండా ఉన్నానని ట్రంప్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అమెరికాకు వచ్చే వారిని జాగ్రత్తగా తనిఖీ చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారుల్ని ఆదేశించానన్నారు. జడ్జి అభిప్రాయం హాస్యాస్పదమని అని ట్రంప్ తెలిపారు. అటు ఏడు ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా అంతటా చర్చనీయాంశమైంది. నిత్యం ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కోతోపాటు అన్ని ప్రధాన నగరాల్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







