అబుధాబి మరియు అల్ ఐన్ లో కొత్త బస్సు సేవలని ప్రకటించిన ఐటీసీ
- February 08, 2017
అబుధాబి మరియు అల్ ఐన్ లో కొత్త బస్సు సేవలని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) అబూధాబీ లో మున్సిపల్ వ్యవహారాల రవాణా శాఖ,అబూధాబీ సిటీ మరియు అల్ ఐన్, మరియు శివారు బస్సు నెట్వర్క్ సేవలను అభివృద్ధిలో భాగంగా ప్రకటించింది. కొన్నిమార్గాలలో కొత్త సేవలు జోడించబడ్డాయి,మరి కొన్ని కొన్ని మార్పులు చేయగా ఇంకొన్ని చోట్లలో ఏకంగా బస్సు సర్వీస్ లను రద్దు చేశారు.ఈ కొత్త సేవలు, ఫిబ్రవరి 10 వ తేదీ 2017 నుంచి అమలు చేయబడనుంది. బస్సు ఆఫీస్ డివిజన్ డైరెక్టర్ ఖలేద్ మ్యాటర్ అల్ మంసారి మాట్లాడుతూ మార్పులు సురక్షితమైన మరియు ఆధునిక బస్సు సేవను రూపొందించే క్రమంలో ఏర్పాటుచేయబడ్డాయని బస్సు నెట్వర్క్లకు స్థిరమైన మరియు ఇంటిగ్రేటెడ్ పరిష్కారాలను అందించడానికి ఈ ప్రణాళిక దోదాపడుతుందని ఆయన చెప్పారు.ఈ మార్పులతో బస్సు నెట్వర్క్ సక్రమంగా కొనసాగడంతో పాటు అబూధాబీ ఎమిరేట్ లో మౌలిక రవాణా వ్యవస్థని విస్తరించే లక్ష్యంతో పలు అధ్యయనాలు జరిపిన తర్వాత రూపొందించినట్లు ఆయన అన్నారు.వినియోగదారుల ఆరోగ్య, భద్రత మరియు పర్యావరణ ప్రయోజనాలను పాటు, తక్కువ ఖర్చుతో సులభమైన రవాణా హక్కుతో పాటు సులభమైన బస్సు సేవలు అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







