బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఒక సినిమా...

- February 08, 2017 , by Maagulf
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఒక సినిమా...

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'అల్లుడు బంగారం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా కోసం బోయపాటి ఒక పాటను సిల్వర్ స్ర్ర్కీన్ పై భారీ స్థాయిలో ఆవిష్కరించాలనే ఆలోచనలో ఉన్నాడట. 400 మంది డాన్సర్స్ ఈ పాటలో పాల్గొననున్నారని అంటున్నారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. 'సరైనోడు' తరువాత బోయపాటి చేస్తోన్న ఈ సినిమాతో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిట్ పడుతుందేమో చూడాలి.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com