పనీర్ జిలేబీ...
- February 08, 2017
కావలసిన పదార్ధాలు: పనీర్ తురుము- 1 కప్పు, మైదా- 4 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ- 2 టేబుల్ స్పూన్లు, పెరుగు- 1 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్- 1/2 టీ స్పూను, యాలకుల పొడి- 1 టీ స్పూను, పంచదార- 3 కప్పులు, నీళ్ళు- 3 కప్పులు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని పంచదార, యాలకుల పొడి వేసి తీగ పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పనీర్‌లో మైదా, బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకుని రెండు గంటలు నాననివ్వాలి. ఆ తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనూ తాడులా పేనుతూ, జిలేబి చుట్ట లాగా గుడ్రంగా చుట్టి, తక్కువ మంట మీద నూనెలో వేగించుకోవాలి. తరువాత పాకంలో వేసి, కొంచెం ఉబ్బుగా అయ్యాక బయటకు తీసివేయాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







