దలైలామా పర్యటన నేడు అమరావతిలో...
- February 08, 2017
అమరావతి: బౌద్ధమత పరమాచార్యులు దలైలామా గురువారం అమరావతిలో పర్యటించనున్నారు.స్థానిక బౌద్ధ స్తూపానికి సంబంధించిన వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన రాతిపేటికలకు పూజలు చేసి, స్తూప ప్రదక్షిణలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమం ప్రారంభంకానుంది. దలైలామాతోపాటు మరో 12 మంది బౌద్ధ గురువులు పూజా క్రతువులో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత చేపట్టేందుకు దలైలామా ముఖ్య రక్షణ అధికారి దోన్‌సెన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి పాసుర్ వాంగ్‌చుక్ బుధవారం అమరావతి చేరుకున్నారు. గుంటూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దారు పి.భాస్కరరావు, స్తూప ప్రాంగణం పర్యవేక్షకులు సాయితో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







