మోసపూరిత కాల్స్ పై బాటెల్కో హెచ్చరిక
- February 09, 2017
మనామా: బాటెల్కో తన వినియోగదారులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. మీరు పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారని తెలియజేస్తూ వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్ గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.బహరేన్ మొబైల్ నుంబర్ల నుండి మరియు విదేశీ నుంబర్ల నుండి చేయబడుతున్న ఇటువంటి కాల్స్ ఈ రోజుల్లో రావడం మామూలు విషయంగా మారింది. అటువంటి మోసగాళ్ల నుంచి ఫోన్‌కాల్ అందుకొన్న వినియోగదారులు గమనించాల్సిందేమిటంటే బాటెల్కో కస్టమర్ యొక్క సిమ్ కార్డు మరియు బ్యాంకు వివరాలు లేదా పాస్‌వర్డ్‌లను సంబంధించిన ఇతర వ్యక్తిగత సమాచారం వివరాలను ఎన్నడూ అడగదని గుర్తించాలి. ఈ తరహా మోసగాళ్లు వినియోగదారులకు ఒక పెద్ద నగదు బహుమతి మీరు గెల్చుకొన్నారని నెమ్మదిగా వారి ఉచ్చులోనికి లాగుతారని తెలిపింది. ఆ డబ్బుని మీరు పొందఁఝాలంటే, ఒక నిర్దిష్ట నెంబర్ కు కొంత డబ్బుని పంపాలని, అంతే కాక బ్యాంకు అకౌంట్ నంబర్లు...ఇంటి అడ్రస్... గుర్తింపు కార్డులు తదితర అవసరమైన సమాచారం ఇవ్వాలని కోరతారు. బాటెలీకా వినియోగదారులు ఆ తరహా అపరిచుతుల వలలో పడవద్దని సలహా ఇస్తుందని వివరించారు. అంతేకాక ఈ మోసపూరిత కాల్స్ తో పాటు,వినియోగదారులు బహుమతులు గెల్చుకొన్నారని వాటిని మీ అకౌంట్ నెంబర్ కు బదిలీ చేస్తామని కనుక మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ తెలియచేయమని అబద్ధపు టెక్స్ట్ సందేశాలు లేదా ఇమెయిల్స్ పంపిస్తారని తెలిపారు.బాటెల్కో అటువంటి ఒక బహుమతి గెలుచుకున్నారని తమ వినియోగదారులను ఎల్లప్పుడూ వ్యక్తిగత వివరాలు ఏమీ అడగదని ఒకవేళ ఏదైనా బహుమతిని తమ వినియోగదారులకు అంధ చేయాలంటే వారికి నేరుగా బాటెల్కో యొక్క హామాలా ముఖ్యపట్టణం గాని లేదా ఒక బాటెల్కో రీటైల్ దుకాణానికి ఆహ్వానించి అందచేస్తామని తన వినియోగదారులకు సంప్రదించడం ప్రొఫెషనల్ ప్రక్రియ ద్వారా ఉపయోగిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









