చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం
- September 17, 2015
భారీ భూకంపం ఒకటి చిలీని వణికించేస్తోంది. రిక్టర్ స్టేల్పై 8.3గా నమోదయ్యింది. గురువారం జరిగిన ఈ సంఘటనతో జనం బెంబేలెత్తిపోయారు. అందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. ఇదిలా ఉండగానే సునామీ హెచ్చరికలతో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాజధాని శాండియాగోకు వాయువ్యం దిశలో 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వాల్ పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలతో కూడిన సునామీ చీలీ తీర ప్రాంతాన్నితాకే ప్రమాదముందని సునామీ హెచ్చరికల జారీ కేంద్రం హెచ్చరించింది. దీంతో ప్రజలు ఇళ్ళలో ఉండలేక బయటకు వెళ్లలేక నడి రోడ్లపైనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







