నందమూరి హరికృష్ణ రీఎంట్రీ తనయుడితో...

- February 10, 2017 , by Maagulf
నందమూరి హరికృష్ణ రీఎంట్రీ తనయుడితో...

నందమూరి హరికృష్ణ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నాడు. తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట హరికృష్ణ...
నందమూరి కథానాయకుడు హరికృష్ణ దాదాపు పన్నిండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత.. మళ్లీ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య' వంటి హిట్ సినిమాలలో కథానాయకుడిగా నటించిన హరికృష్ణ.. ఇప్పుడు తన తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడట.
'లాహిరి లాహిరి లాహిరిలో..'ని హరికృష్ణ,భానుప్రియ నటరత్న నందమూరి తారకరామారావు వారసత్వంగా నటనను ప్రారంభించిన హరికృష్ణ.. తన కెరీర్ లో ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఇది రెండోసారి.
పదేళ్ల వయసులోనే నటనను ప్రారంభించిన హరికృష్ణ.. బాలనటుడిగా 60, 70లలోనే 'శ్రీకృష్ణావతారమ్', 'తల్లా పెళ్లామా', 'తాతమ్మకల', 'రామ్ రహీమ్', 'దానవీర శూరకర్ణ' వంటి చిత్రాల్లో పలు ప్రాధాన్యతగల పాత్రలతో మెప్పించాడు. 1977లో విడుదలైన చిత్రరాజం 'దానవీర శూరకర్ణ' తర్వాత.. దాదాపు ఇరవై సంవత్సరాల గ్యాప్ తీసుకున్న హరికృష్ణ.. మోహన్ బాబు 'శ్రీరాములయ్య' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
కథానాయకుడిగా సోలో హిట్స్ అందించిన నందమూరి హీరో హరికృష్ణ.. ఇప్పుడు తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో అలరించనున్నాడట. పవన్ సాదినేని దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందే చిత్రంలో.. హరికృష్ణకోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రూపొందించారట. మొత్తంమీద.. ఎవ్వరిమాటా వినని ఈ సీతయ్య.. మరోసారి వెండితెరపై తన రౌద్రరూపాన్ని ప్రదర్శిస్తాడేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com