సౌదీ నాయకత్వంతో బహ్రైన్ అధినేత ముఖ్య సమావేశం
- September 17, 2015
బహ్రైన్ అధినేత హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ , రెండు పవిత్ర మసీదుల ధర్మకర్త కింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ తో మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అరబ్ కూటమికి నాయకత్వం వహిస్తున్న సౌదీ యెమన్ లో ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి సౌదీ నాయకత్వంలో సాగుతున్న అరబ్ దేశాల కూటమిని నాయకత్వం వహిస్తున్న గల్ఫ్ ప్రాంత దేశాల సర్వభౌమత్వాన్ని, ప్రజల గౌరవాన్ని కాపాడడంలో కూటమి ముఖ్యపాత్ర పోషిస్తున్నదని ప్రశంసిస్తూ , ఈ ప్రాంతానికి సంభవించిన అనేక ప్రమాదాలను పారద్రోలడంలో కింగ్ సల్మాన్ వారి చాకచక్యాన్ని కింగ్ హమాద్ కొనియాడారు. ఇరునేతలు తమ దేశాల చారిత్రాత్మక, దృఢ సంబంధాలను గూర్చి, అనేక తాజా ప్రాంతీయ, అరబ్ మరియు అంతర్జాతీయ విషయాలను గూర్చి చర్చించారు.ఈ చర్చలలో సౌదీ యువరాజు, ఉపాధ్యక్షులు మరియు ఆంతరంగిక శాఖా మంత్రి నయేఫ్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ మరియు ఉప యువరాజు, రెండవ ఉపాధ్యక్షులు మరియు రక్షణ శాఖా మంత్రి ప్రిన్స్ మొహమ్మెడ్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ కూడా పాల్గొన్నారు. అనంతరం, తన గౌరవార్ధం, సౌదీ చక్రవర్తి ఏర్పాటుచేసిన విందులో బహ్రైన్ అధినేత పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







