ఖైరతాబాద్ వినాయకునికి గవర్నర్ దంపతుల తొలిపూజలు !
- September 17, 2015
తెలంగాణలకు తలమానికమైన ఖైరతాబాద్ వినాయకుడు కోలువైనాడు.. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తొలిపూజలు జరిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. చవితి ఉత్సవాలను ప్రారంభించారు. సతీసమేతంగా ఖైరతాబాద్ వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైరతాబాద్ విఘ్నేశ్వరునికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని.. ప్రజలు ఎప్పటి నుంచో ఇక్కడ భక్తి ప్రపత్తులతో వినాయకున్ని పూజిస్తున్నారని అన్నారు. అంతే కాదు హైదరాబాద్ లో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఉండాలని భారత దేశ ఖ్యాతిని నలు దిశలా వెలిగేలా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో గణేశుడికి వారు కొత్త వస్త్రాలు కూడా సమర్పించారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సంతోషంగా జీవించేలా చూడాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నానని తెలిపారు. గణేశ్ ఉత్సవాలను ప్రారంభించేందుకు వచ్చిన నరసింహన్ దంపతులను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఘనంగా సత్కరించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







