' 50 కోట్ల ' క్లబ్ లో చేరిన 'ఎస్-3'

- February 12, 2017 , by Maagulf
' 50 కోట్ల ' క్లబ్ లో చేరిన 'ఎస్-3'

సూర్య , అనుష్క , శృతి హాసన్ జంటగా హరి దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఎస్ 3 ..ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసందే..సింగం , సింగం 2 సూపర్ హిట్స్ కావడం తో ఎస్ 3 ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో చిత్ర ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇక మూడు రోజుల్లో రూ.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

'సింగం 3' తొలిరోజు రూ.
20 కోట్లు వరకూ వసూలు చేసిందని, రెండోరోజు దాదాపు రూ.14 కోట్లు, మూడోరోజు రూ.15 కోట్లు వసూలు చేసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ కంటే తెలుగు లో మంచి వసూళ్లు చేస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రం విడుదలైన రోజే పైరసీకి గురి కావడం తో చిత్ర నిర్మాతలకు గట్టి దెబ్బ పడింది. లేకపోతే చిత్ర వసూళ్లు ఇంకా బాగుండని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com