బాలకృష్ణ తప్పకుండా వస్తారు: చిరు
- February 12, 2017
దాదాపు పదేళ్ల తర్వాత 'ఖైదీ నంబర్ 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి వెండితెరను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి రెడీ అవుతున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్‌కు చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను వెల్లడించారు చిరంజీవి. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనేది వినోదభరితమైన ఆట కాదని, భావోద్వేగాలతో కూడిన ఆట అని చిరంజీవి చెప్పారు. తాను నాగార్జున షోకు గెస్ట్‌గా వెళ్లానని, ఇప్పుడు ఆయన తన షోకు గెస్ట్‌గా రావడానికి ఒప్పుకున్నారని, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు తన షోకు వస్తారని మెగాస్టార్ అన్నారు.
'బాలకృష్ణ కూడా వస్తారా?' అన్న ప్రశ్నకు ''తప్పకుండా వస్తారు. మేమిద్దరం మంచి స్నేహితులం. మొన్న జరిగిన ఓ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశాం. నేను పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారు.
ఆయనకూ ఆహ్వానం పంపిస్తాం'' అని బదులిచ్చారు చిరంజీవి. [స్టార్ మా లోగోను ఆవిష్కరించిన చిరంజీవి] ''సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తప్ప నాకు ఎవరూ సన్నిహితులు లేరు''. అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించిన విషయం విధితమే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







