నేటి నుంచి బుల్లితెర మెగా హంగామా !
- February 12, 2017
దశాబ్ద కాలం తర్వాత 'ఖైదీ నంబర్ 150' గా రీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 100 కోట్ల నెట్ కలక్షన్స్ మార్క్ ను అందుకున్న చిరంజీవి ఈరోజు నుంచి తన బుల్లితెర హంగామాను మొదలు పెట్టబోతున్నాడు. తెలుగులో బుల్లితెర పై సూపర్ హిట్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో లేటెస్ట్ సిరీస్ ఈరోజు నుంచే ప్రారంభం కానుంది.
గతంలో నాగార్జున హ్యాండిల్ చేసిన ఈకార్యక్రమం ఇప్పుడు చిరంజీవి చేతికి రావడంతో ఈకార్యక్రమం పై మరింత ఆసక్తి పెరిగింది. 'మా' టివి 'స్టార్ మా' అన్న కొత్త లోగోతో ఈరోజు నుంచి తన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న నేపధ్యంలో ఈరోజు రాత్రి 9.30 లకు మెగాస్టార్ హోస్ట్ చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఈ షోకు సంబంధించి ఇందులో 60 ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. వారానికి నాలుగు ఎపిసోడ్లు చొప్పున ప్రసారం మొత్తం 15వారాలపాటు బుల్లితెర పై మెగా సందడి కనిపించబోతోంది. అయితే గతంలో నాగార్జున హోస్ట్ చేసిన ఈ షోకు నాగ్ తనకు ఉన్న వాక్ చాతుర్యంతోపాటు సినిమా రంగంలో తనకున్న పరిచయాలతో ఆ ప్రోగ్రామ్‌ని రక్తి కట్టించాడు. అయితే టాలీవుడ్ లో చిరంజీవికి విపరీతంగా ఫాలోయింగ్ ఉన్నా సమయస్పూర్తిలో నాగార్జున ముందు చిరంజీవి సమర్ధత సరిపోదు అన్న కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ప్రతి క్షణం ఈ 'షో'ని ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా మలచడంలో చిరంజీవి ఏ మేరక సక్సెస్ అవుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
ముఖ్యంగా స్పాంటేనియస్‌గా మాట్లాడటం, సరదా సరదాగా గేమ్ షోని నడిపించడం టెలివిజన్ షోలకు చాల అవసరం. అయితే ఈ విషయంలో చిరంజీవి ఎంత వరకు సక్సస్ సాధిస్తాడు అన్న అనుమానాలు ఇప్పటికే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున వెంకటేష్ బాలకృష్ణలు కూడ పాల్గొనే అవకాశం ఉంది. మహిళా దినోత్సవం రోజున చిరంజీవికి అత్యంత సన్నిహితులైన రాధిక సుమలతలు రాబోతున్నారు. ఏమైనా ఈరోజు 'స్టార్ మాటివి' కి అద్భుతమైన రేటింగ్స్ రాబోతున్నాయి అన్నది వాస్తవం..
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







