‘బిగ్ ఐడియా విజ్కిడ్ అవార్డ్స్’ గెలుచుకున్న శ్రీ దివ్య,కృష,ధ్రువ దత్త
- February 13, 2017
బిగ్ ఐడియా ఇటీవలే ఆరవ ‘బిగ్ ఐడియా విజ్కిడ్ అవార్డ్స్’ 10న ఫిబ్రవరి స్ప్రింగ్ డెల్స్ స్కూల్ లో జరిపారు.క్రియేటివ్ స్టార్స్ ఆఫ్ యు.ఏ.ఈ గా మన తెలుగు పిల్లలు శ్రీ దివ్య,కృష,ధ్రువ దత్త గెలుపొందారు.పోటీలు నాలుగు క్యాటగిరీస్ లో జరిగాయి.కాన్సెప్ట్(కెజి-- గ్రేడ్ 2),కల్చర్,(గ్రేడ్3--5),క్రియేటివిటీ(గ్రేడ్6--8)మరియు రైసింగ్ స్టార్స్ (గ్రేడ్9--12).ప్రతి క్యాటగిరీ లో చిత్ర లేఖనం,స్టోరీ రైటింగ్,పోయెట్రీ పోటీలు నిర్వహించారు.
శుక్రవారం స్ప్రింగ్ డెల్స్ స్కూల్ లో జరిగిన ఆరవ బిగ్ ఐడియా విజ్కిడ్ అవార్డు ఫంక్షన్ లో బహుమతి ప్రదానం చేసారు. 12వ తరగతి చదువుతున్న శ్రీ దివ్య మాట్లాడుతూ, నేను నాలుగు సంవత్సరాలుగా పోటీల్లో పాల్గొంటున్నాను.ఈ సారి కవితల పోటీల్లో గెలుచుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు.నాలుగవ తరగతి చదువుతున్న కృష తాను కథల పోటీల్లో రెండవ సారి గెలుచుకోవటం సంతోషంగా ఉంది అని చెప్పింది.ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ లో చదువుతున్నారు.ధ్రువ దత్త ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్,అజ్మాన్ లో నాలుగవ తరగతి చదువుతున్నాడు.పోటీల్లో 200 స్కూల్స్ నుంచి 5000 మంది పైగా పాల్గొన్నారు.వాళ్ళల్లో అన్ని క్యాటగిరీస్ లో 450 మందిని ఎంపిక చేసి,వాళ్ళల్లో కధల పోటీల్లో విజేతగా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేసారు.దివ్య,కృష తల్లితండ్రులు శ్రీ మతి పద్మజ,కిషోర్ మరియు ధ్రువ తల్లితండ్రులు శ్రీ లక్ష్మి,సూర్య మాట్లాడుతూ తమ పిల్లల్ని చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాము అని చెప్పారు.ఇలాంటి పోటీలు మరిన్ని గెలవాలి అని వారి సంతోషాన్ని వ్యక్తం చేసారు.



తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









