లాహోర్‌లో బాంబు పేలుడు, 10మంది మృతి
- February 13, 2017
పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయత్రం పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లో అసెంబ్లీ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారులతో సహా కనీసం పదిమంది మరణించనట్టు సమాచారం. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
నిరసనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో పేలుడు పదర్ధాలు నింపిన వాహాన్ని పేల్చివేసినట్టు పాక్ మీడియా కథనం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులు హస్తం ఉందా? వంటి విషయాలు తెలియాల్సి వుంది. గతేడాది లాహోర్ లోనే పబ్లిక్ పార్క్‌లో సంభవించిన బాంబు పేలుడులో దాదాపు 70 మంది మరణించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







