ఇండో - నేపాల్ సరిహద్దు మూసివేత
- February 13, 2017
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దును మూసివేసినట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. యూపీ రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 15న జరగనున్నాయి.
అదే రోజున శాసనసభకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 7 గంటలకు సరిహద్దును తెరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే సరిహద్దును మూసివేసినట్లు వారు పేర్కొన్నారు.
నేపాల్ లోని కంచన్ పూర్ జిల్లాలో బెల్దాండి, త్రిభువన్ బస్తీ లలోని సరిహద్దులను మూసివేసినట్లు కంచన్ పూర్ డీఎస్పీ నైన్ సింగ్ కర్కీ తెలిపారు. ఎన్నికల సమయంలో సరిహద్దును మూసివేయడం సాధారణమేనని, సంఘ విద్రోహక శక్తులను అరికట్టేందుకే బోర్డర్ ను మూసివేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







