ప్రపంచ పర్యాటక దినోత్సవం-2017 (WTD )నిర్వహణను చేజిక్కించుకున్న కతార్
- September 17, 2015
'స్థిరమైన పర్యాటక రంగం-అభివృద్ధికి మార్గం' అనే నినాదంతో జరగబోయే 2017 సంవత్సరపు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించే అవకాశాన్ని కతార్ చేజిక్కించుకుంది! మెడెలిన్ లోని కొలంబియన్ సిటీలో జరిగిన 21 వ యునైటెడ్ నేషన్స్ వల్డ్ టూరిజమ్ ఆర్గనైజెషన్ (UNWTO) వారి వోటింగ్ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న వేర్వేరు ఖండాలలో జరుపుకొనబడే ప్రపంచ పర్యాటక దినోత్సవం, అంతర్జాతీయంగా జరుపుకొనే అతిపెద్ద పర్యాటక ఉత్సవం అన్న సంగతి తెలిసిందే;
కతార్ పర్యాటక రంగం , 2030 సంవత్సరానికల్లా అంతర్జాతీయ స్థాయిలో దూసు కెళ్ళాలనే లక్ష్యంతో నేషనల్ టూరిజమ్ సెక్టర్ స్ట్ర్యాటజీ ప్రణాళికను రచిస్తోందని కేటార్ టూరిజమ్ ఆధారిటీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ డైరెక్టర్ - సైఫ్ అల్-కువారి తెలిపారు. కతార్లో WTD 2017 నిర్వహణ, ఆ రంగంలో తాము సాధించిన విజయాలకు సరైన సమయంలో లభించిన ఒక చక్కని వేదిక ఔతుందని, ఇకపై సాధించబోయే వాటికీ ప్రేరణ ఔతుందని ఆయన విశ్లేషించారు. సాంఘిక, ఆర్ధిక హద్దులను అధిగమించి, అభివృద్ధిని ప్రోత్సహించే అపురూప లక్షణం పర్యాటక రంగానికుండని ద UNWTO సెక్రెటరీ జనరల్ డా. తలెబ్ రిఫయి తెలియజెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







