రద్దయిన నోట్ల మార్పిడి: ఎన్నారైలకు గడువు పెరిగే అవకాశం

- February 15, 2017 , by Maagulf
రద్దయిన నోట్ల మార్పిడి: ఎన్నారైలకు గడువు పెరిగే అవకాశం

భారతదేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కరెన్సీ రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎన్‌ఆర్‌ఐల కోసం జూన్‌ 30 వరకు అవకాశం కల్పించింది. అయితే ఈ డెడ్‌లైన్‌ని సమీప భవిష్యత్తులో పెంచే అవకాశం ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌ హోమి ఫిరోజ్‌ రనినా చెప్పారు. నవంబర్‌ 9 నుంచి 30 డిసెంబర్‌ వరకు విదేశాల్లో ఉన్నవారు మార్చ్‌ 31 వరకు రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పించారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పటినుంచి (నవంబర్‌ 8) విదేశాల్లోనే ఉన్నవారు జూన్‌ 30 వరకు రద్దయిన నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పించారు. మోడర్న్‌ ఎక్స్‌ఛేంజ్‌ కంపెనీ నిర్వహించిన ఈవెంట్‌లో హోమి ఫిరోజ్‌ రనినా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నకిలీ నోట్లు, నల్లధనం రూపంలో నడవకుండా ఉండేందుకే కరెన్సీ రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా ఈ ఈవెంట్‌లో ఇండియా అంబాసిడర్‌ టు ఒమన్‌ ఇంద్రా మణి పాండే తదితరులు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com