ఫేస్‌బుక్‌ కొత్త వీడియో యాప్‌ టీవీ కోసం...

- February 16, 2017 , by Maagulf
ఫేస్‌బుక్‌ కొత్త వీడియో యాప్‌ టీవీ కోసం...

ముంబయి: ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి సరికొత్త వీడియో యాప్‌ విడుదలైంది. ప్రత్యేకంగా టీవీ కోసం ఫేస్‌బుక్‌ ఈ వీడియో యాప్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఇది యాపిల్‌ టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ, సామ్‌సంగ్‌ స్మార్ట్‌ టీవీ యాప్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుందని ఫేస్‌బుక్‌ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఈ యాప్‌ ద్వారా స్నేహితులు లేదా ఫాలో అవుతున్న ఫేస్‌బుక్‌ పేజీల్లో పోస్ట్‌ చేసిన వీడియోలు చూడొచ్చు. అలాగే టాప్‌ లైవ్‌వీడియోలు, ఆసక్తులను బట్టి రికమండెడ్‌ వీడియోలు కూడా వీక్షించవచ్చు.తరవాత చూడడానికి సేవ్‌ చేసి పెట్టుకున్న, అప్పటికే చూసిన వీడియోలు మళ్లీ చూడాలనుకున్నా కూడా ఈ యాప్‌ ద్వారా సాధ్యమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com