ఒమాన్ రోడ్ల సుందరీకరణకు 2.5 బిలియన్ రియాల్స్
- September 18, 2015
ప్రస్తుతం ఒమాన్ లోనిర్మాణంలో ఉన్న రహదారుల సుందరీకరణకు ఖజానాపై 2.5 బిలియన్ రియాల్స్ భారం పడనుంది; ఐతే ఈ రోడ్లనిర్మాణ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వారి ఈ దృఢ నిశ్చయం ఫలితంగానే, వర్ల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వారి ఆర్ధిక నివేదిక - గ్లోబల్ కాంపిటిటీవ్నెస్ ఇండెక్స్ (GCI) ప్రకారం 2014-15 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో, గల్ఫ్ ప్రాంతంలో రెండవ స్థానంలో ఉన్నాయి!
ఆమోదిత పంచవర్ష ప్రణాళిక ప్రకారం నిర్మించబడుతున్న ఈ రహదారులు, సుల్తానెట్ యొక్క నిర్మాణ మరియు ఆర్ధికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తాయని అధికారి ఒకరు విశ్లేషించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన రహదారులు: బిద్ బిడ్ /సూర్ ప్రోజెక్టు (1 మరియు 2 స్టెజ్ ) ల డ్యూయలైజేషన్ ; సినా-మహుట్-దుక్మ్ రోడ్ (1 మరియు 2 స్టెజ్ ),టాకా / మీర్బాట్ రోడ్డు డ్యూయలైజేషన్, అల్-బతినా ఎక్స్ప్రెస్ వే (1-6 స్టెజ్ లు), ఆడమ్- థుమ్రైత్ రోడ్డు ప్రాజెక్ట్( 1,2 స్టెజ్), జిబ్రైన్-ఇబ్రీ డ్యూయలైజేషన్ (ఫేజ్ 2), బార్ఖా/ నఖాల్ రోడ్డు డ్యూయలైజేషన్, ఇబ్రీ-అల్ దారీజ్-మస్కాన్ (హిజైరాట్-మస్కాన్ యొక్క పార్ట్ 1) ఇబ్రీయన్కాల్ రోడ్డు డ్యూయలైజేషన్ (ఫేజ్ 2).
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కౌంట్ డౌన్ టైమర్స్ ను ఏర్పాటుచేసే విషయమై ఒక ప్రశ్నకు సమాధానంగా, మస్కట్ గవర్నరేట్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రణాళికా శాఖ యోచిస్తోందని తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







