కతార్‌లో ఆహారపదార్ధాల పేకేజింగ్, లేబిలింగ్ పై సందేహాలు
- September 18, 2015
ఆహారపదార్ధాల పేకేజింగ్, లేబిలింగ్ పై కతార్ వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దోహాలోని అనేక పెద్ద సూపర్ మార్కెట్లలో తయారుచేయబడి, విక్రయించబడే బ్రెడ్, ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ బాగ్ లలో ప్యాక్ చేయబడుతుంది, మరియు దానిపై ఉన్న అంతర్జాతీయ చిహ్నం, పాక్కెజింగ్ పదార్ధం సురక్షితమని తెలియజేస్తుంది. సెప్టంబర్ 2013 న, ప్రజారోగ్య శాఖ, ఆహారపదార్ధాలను పేక్ చేయడానికి పాలీ ఇథలీన్, వార్తాపత్రికలను, ఇతర కాగితాలను వాడటాన్ని నిరోధించింది. కానీ కొన్ని హైపర్ మార్కెట్లను సో దా చేసినపుడు, కొన్ని రకాల అరబిక్ బ్రెడ్ లపై కేవలం తయారీదారు పేరు, ఫోన్ నంబర్లు మాత్రమే ముద్రిచబడటం, చపాతీ వంటి కొన్ని పదార్ధాలపై వాడబడిన పదార్ధాల వివరాలు తప్ప, వాటి పోషకవిలువల గురించి తెలియక పోవడం వంటి అంశాలు గమనించారు. హమాద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) , ఒఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఛైర్మన్ - ప్రొఫెసర్ అబ్దుల్-బడీ-అబూ-సమ్రా ఇటీవల - ప్లాస్టిక్ కాగితాలను, ప్లాస్టిక్ డబ్బాలను వాడటం వలన రసాయనాలు పదార్ధాలలో కలిసే అవకాశముందని, ఇందుకై PVC ప్లాస్టిక్ ను వాడటం ఉత్తమమని తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







