విడుదలైన 'తోలి పరిచయం' ట్రైలర్
- February 16, 2017
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఓ వైపు స్టార్ హీరోలు, వారి వారసుల హవా కొనసాగుతున్న తరుణంలో కొత్త హీరో, హీరోయిన్ల ఇంట్రడ్యూస్ అవుతున్నారు. గత సంవత్సరం 'పెళ్లిచూపులు' లాంటి చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో చిన్న సినిమాలపై ఎక్కువ మోజు చూపిస్తున్నారు దర్శక, నిర్మాతలు. తాజాగా పియుకె ప్రొడక్షన్స్ పతాకంపై దీపక్‌కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'తొలి పరిచయం'. ఎల్. రాధాకృష్ణ దర్శకుడు. వెంకీ, లాస్య హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా ద్వారా యంగ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. ఇటీవల కాలం లో సినిమాలో కొంచెం బాగున్నా ఆడేస్తున్నాయి. మంచి వసూళ్లు రాబడుతున్నాయి. నా ఫ్రెండ్ కళహరి రెడ్డి ఈ సినిమాలో ఓ పార్ట్ అయ్యాడు. తనతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అన్నారు. ఈ సందర్బంగా హీరో వెంకీ మాట్లాడుతూ.. 'ప్రజంట్ జనరేషన్ ఆలోచనకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుంది. పాపికొండల్లాంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరిగింది' అన్నారు.
ఈ చిత్రంలో మురళీమోహన్, సుమన్, రాజీవ్ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్, వైవా హర్ష, కళ్లు కృష్ణారావు, ప్రీతినిగమ్, రాగిణి, మధుమణి, సాహితి, దీప్తి, మాధవి, రామిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫి: శరవణ కుమార్ సి., ఎడిటర్: కృష్ణపుత్ర, మ్యూజిక్: ఇంద్రగంటి, డాన్స్: కృష్ణారెడ్డి, లిరిక్స్: చంద్రబోస్, కాసర్ల శ్యాం, కరుణాకర్, కో ప్రొడ్యూసర్: సురేష్‌కుమార్, ధర్మేంద్ర, నిర్మాత: దీపక్‌కృష్ణ, దర్శకత్వం: ఎల్.రాధాకృష్ణ.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









