హోం డెలివరీ పారాచూట్‌తో...
- February 16, 2017
ఇంటర్నెట్‌డెస్క్: సరకులను హోం డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సరికొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే డ్రోన్లతో డెలివరీ సేవలను ప్రారంభించిన ఆ సంస్థ.. ఇకపై గగనతలం నుంచి కస్టమర్ల ఇంటి గుమ్మం ముందు పార్శిళ్లను దించేందుకు పారాచూట్లను వినియోగించనుందట.
ప్రస్తుతం అమెజాన్ ప్రారంభించిన ‘డ్రోన్ డెలివరీ’ విధానంలో వినియోగదారుడి ఇంటి వద్ద డ్రోన్ లాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే డ్రోన్లు గగనతలంలో ప్రయాణించడం కంటే లాండింగ్.. టేకాఫ్లకే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందట. దాంతో పాటు కొన్ని భద్రతా పరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట.
అందుకే డ్రోన్లతో రవాణా చేసి గగనతలం నుంచే సరకులను భద్రంగా కిందికి దించేందుకు పారాచూట్లను వినియోగించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
అయితే.. కిందికి వదిలాక గాలి ప్రవాహంతో పారాచూట్లు అటుఇటు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ సమస్యకూ పరిష్కారం కనుగొన్నట్లు అమెజాన్ తెలిపింది. పారాచూట్ కిందికి దిగేంత వరకు డ్రోన్ అక్కడే గాలిలో ఉండి గమనిస్తుందట. ఒకవేళ పారాచూట్ పక్కకు కదిలితే ప్రత్యేకంగా సిగ్నళ్లతో దాన్ని సరైన చోటే దిగేలా చేస్తుందట. అందుకు పారాచూట్లలోనూ ప్రత్యేకమైన వ్యవస్థ రూపొందించారట.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









