కార్ బాంబు పేలి 45 మంది మృతి బాగ్దాద్‌లో...
- February 16, 2017
బాగ్దాద్, ఫిబ్రవరి 16: ఇరాక్ రాజధాని బాగ్దాద్ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. వరుసగా మూడోరోజు జరిగిన బాంబు దాడిలో 45 మంది మరణించగా, మరో 60 మంది దాకా గాయపడ్డారని బాగ్దాద్ ఆపరేషన్స్ కమాండ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దక్షిణ బాగ్దాద్‌లోని సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:15 నిమిషాలకు కారులో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న 45 మంది పౌరులు మరణించారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా ప్రాంతం భీభత్సంగా మారింది. కాగా, ఐఎ్‌సకు చెందిన అనుబంధ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బాగ్దాద్‌లో ఇది వరుసగా మూడో పేలుడు. మంగళవారం కార్ బాంబు దాడిలో నలుగురు మరణించగా, బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







