కార్‌ బాంబు పేలి 45 మంది మృతి బాగ్దాద్‌లో...

- February 16, 2017 , by Maagulf
కార్‌ బాంబు పేలి 45 మంది మృతి బాగ్దాద్‌లో...

బాగ్దాద్‌, ఫిబ్రవరి 16: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. వరుసగా మూడోరోజు జరిగిన బాంబు దాడిలో 45 మంది మరణించగా, మరో 60 మంది దాకా గాయపడ్డారని బాగ్దాద్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దక్షిణ బాగ్దాద్‌లోని సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:15 నిమిషాలకు కారులో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న 45 మంది పౌరులు మరణించారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా ప్రాంతం భీభత్సంగా మారింది. కాగా, ఐఎ్‌సకు చెందిన అనుబంధ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బాగ్దాద్‌లో ఇది వరుసగా మూడో పేలుడు. మంగళవారం కార్‌ బాంబు దాడిలో నలుగురు మరణించగా, బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com