సూపర్ మార్కెట్స్, ఈటరీలపై మున్సిపల్ అధికారుల తనిఖీలు..
- February 17, 2017
హెల్త్ మానిటరింగ్ సెక్షన్ - అల్ ఖోర్, అల్ దఖిరా మునిసిపాలిటీ, సూపర్ మార్కెట్లు, బచరీస్ మరియు రెస్టారెంట్లపై దాడులు చేసి, తనిఖీలు నిర్వహించింది. అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉందో లేదో ఈ తనిఖీల్లో అధికారులు పరిశీలించారు. తాజా మాంసం, అలాగే ఇంపోర్ట్ చేసిన మాంసాన్ని సైతం ఈ తనిఖీల్లో అధికారులు పరిశీలించి, హ్యూమన్ కంజంప్షన్కి అనుకూలంగా ఉందా? లేదా? అనే విషయాన్ని తేల్చారు. అలాగే ధరల వివరాల్ని సైతం తెలుసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్‌కి చెందిన కన్స్యుమర్స్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్తో కలిసి మునిసిపాలిటీ అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు. ఇదిలా ఉండగా దోహా మునిసిపాలిటీ, ఎస్పైర్ అకాడమీలో ఫుడ్ సేఫ్టీపై పిల్లల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - బీచెస్ అండ్ ఐలాండ్స్ సెక్షన్, సీలైన్ బీచ్‌ని అవాజ్ కంపెనీతో కలిసి శుభ్రం చేసింది. ఈ సందర్బంగా పెద్దమొత్తంలో వేస్టేజ్‌ని క్లీన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







