బెంగళూరు సరస్సులో మంటలు.. భారీ పొగలు..
- February 17, 2017
నగరంలోని బెల్లందూర్ సరస్సులో గురువారం సాయంత్రం మంటలు చెలరేగి నగరవాసులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ సరస్సులో గతంలో కూడా ఇలాగే మంటలు చెలరేగాయి. సరస్సులో తీవ్ర కాలుష్యం, ఒడ్డున ఇష్టానుసారంగా పడేస్తున్న వ్యర్థాలు, నీటిలో కలుస్తున్న రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. పెద్దఎత్తున వ్యాపించిన పొగల కారణంగా సమీపంలో ప్రజలు రోడ్లపై వెళ్లడానికి భయపడే విధంగా మారింది. అగ్నిమాపక సిబ్బందికి కూడా మంటలను చల్లార్చడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
నిన్న సాయంత్రం సమయంలో మంటలు చెలరేగి, పొగలు వస్తుండడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
సరస్సు చుట్టూ ఉన్న ఎండిపోయిన గడ్డి కూడా తరచూ మండుతుంటుంది. తరచూ ఇక్కడ మంటలు చెలరేగడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బెల్లందూర్, వర్తూర్‌లు బెంగళూరులోని అతి పెద్ద సరస్సులు. అయితే ఈ రెండు సరస్సులు చెత్త, పరిశ్రమల వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సరస్సులను శుభ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సరిగ్గా ఆచరణలో పెట్టకపోవడంతో ఎలాంటి ఫలితం ఉండడం లేదు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







