5 రోజుల్లో 30 కేజీల బరువు తగ్గిన ఇమన్ అహ్మద్
- February 17, 2017
రోజుకి ఒకన్నర నుంచి రెండు కేజీల బరువు తగ్గించాలన్నది వైద్యుల లక్ష్యం. ప్రపంచంలోనే భారీకాయురాలు ఇమన్ అహ్మద్ కేవలం 5 రోజుల్లో 30 కేజీల బరువు తగ్గడంపై వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. వారం కిందట ఇమన్‌ను ఈజిప్టు నుంచి ముంబైకి వ్యయప్రయాసలకోర్చి తరలించారు. బెరియాట్రిక్ సర్జరీకి ముందు రోజుకి ఒకటిన్నర నుంచి రెండు కేజీల వంతున నెల రోజుల్లో 50 నుంచి 60 కేజీలు తగ్గించడానికి వైద్యులు ప్రత్యేక డైట్ రూపొందించారు. ఆపరేషన్‌కి ఇంకా మూడు వారాల గడువు ఉందనగా ఆమె కండిషన్ ఆశావహంగా ఉందని అంటున్నారు సైఫీ హాస్పిటల్ వైద్యులు. ఈజిప్టు నుంచి కార్గో విమానంలో, విమానాశ్రయం నుంచి క్రేన్ సహాయంతో ట్రక్కులో సుమారు 500 కేజీల బరువు ఉన్న ఇమన్‌ను ఆస్పత్రికి తరలించారు.
''ఆపరేషన్ థియేటర్‌లోని టేబుల్ సామర్థ్యం 450 కేజీలు. ఎలివేటర్ వెడల్పు 141 సెం.మీ. ఇమన్ మాత్రం 151 సెం.మీ. ఉంది. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లగలిగేలా ఆమె బరువు తగ్గించాలన్నది మా ప్రస్తుత లక్ష్యం'' అని బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. కాళ్లు చేతులు కాస్త కదిలించగలుతున్న ఇమన్ వైద్యులకు ధన్యవాదాలు చెబుతోందట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







